విదేశాలలో ఇంటి ఓనర్.. ఇంట్లో ఏం జరిగిందో సిసి కెమెరాలో రికార్డ్..!
విదేశాలలో ఇంటి ఓనర్.. ఇంట్లో ఏం జరిగిందో సిసి కెమెరాలో రికార్డ్..!
నేలకొండపల్లి, మన సాక్షి:
ఇంటి ఓనర్ విదేశాలకు వెళ్లటంతో దొంగలు పసిగట్టి చోరీ చేసిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు అందించిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రం లోని మురహరి కోటేశ్వరీ అనే మహిళ ఇటీవల అమెరికా కు వెళ్లారు.
ఇది గమనించిన గుర్తు తెలియని దొంగలు శుక్రవారం అర్ధరాత్రి చోరి కి పాల్పడ్డారు. ఇంటి తలుపులు పగలగొట్టి, బీరువా లో ఉన్న దిద్దులు, రూ.10 వేల నగదు ను చోరీ చేశారు. దాదాపు గా రూ.30 వేల వరకు చోరీ జరిగి ఉంటుందని ఫిర్యాదు లో పేర్కోన్నారు. కాగా దొంగలు ముసుగు వేసుకుని ఇంట్లో చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డు అయ్యాయి.
చోరీ విషయం ను ఇంటి పని మనిషి శనివారం ఉదయం రాగానే చూడగా ఇంటి తలుపులు పగలగొట్టిన విషయం గురించారు. అనుమానం వచ్చి ఇంటి పైన అదె కు ఉంటున్న మేకల వెంకటేశ్వర్లు కు సమాచారం ఇవ్వటంతో ఆయన అమెరికాలో ఉంటున్న ఓనర్ కు సమాచారం అందించారు. ఆమే సూచన మేరకు వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, పోలీసులు సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు.
LATEST UPDATE :
District collector : వికలాంగుల సర్టిఫికెట్లలో అక్రమాలు.. విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!
Dry Peas : ఇవి తింటే గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణపై అద్భుతమైన ప్రభావం..!
Hydra : హైడ్రా బాధితులకు అండగా ఉంటా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన..!









