Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. వారికోసం తెలంగాణ దర్శిని..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. వారికోసం తెలంగాణ దర్శిని..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. 500 గ్యాస్ సిలిండర్ పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం. రైతుల పంట రుణాల మాఫీ,.. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టారు.
విద్యార్థుల కోసం శుభవార్తను తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ‘తెలంగాణ దర్శిని” అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలలో ఉన్న పాఠాలను చదువుకోవడమే కాకుండా చారిత్రక సాంస్కృతిక, ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల మేధాశక్తి పెరగనున్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2వ తరగతి నుంచి 4వ తరగతి విద్యార్థుల కు ఒకరోజు ఫీల్డ్ ట్రిప్ పేరుతో హెరిటేజ్ సైట్లు, పార్కులు చూపిస్తారు. వాటి ప్రాముఖ్యతను వివరిస్తారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు పాఠశాలకు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను వాటి విశిష్టతలను విద్యార్థులు తెలుసుకొనేలా ట్రిప్ నిర్వహిస్తారు.
9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు రెండు రోజులపాటు 70 కిలోమీటర్ల లోపు ఉన్న చారిత్రక సంస్కృతి, శిల్ప సంపదలు తెలుసుకునే ట్రిప్పును నిర్వహిస్తారు.
అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులకు నాలుగు రోజులపాటు వారి వారి సొంత జిల్లాలు దాటి సుదూర ప్రాంతాలకు ఈ టూర్లను తీసుకువెళ్లనున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను విద్యార్థులకు చూపించడంతోపాటు వాటి గురించి వివరించనున్నారు. చారిత్రక సంపదను కాపాడి విద్యార్థులకు తెలియజేస్తే వారికి అనుభవ జ్ఞానం లభిస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయం.
LATEST UPDATE :









