Breaking NewsTOP STORIESతెలంగాణ

Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!

Digital Cards : తెలంగాణలో డిజిటల్ కార్డుల పైలట్ సర్వే ప్రారంభం.. ఈ వివరాలు మీ దగ్గర ఉంచుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జారీచేసిన డిజిటల్ కార్డుల ను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి తెలంగాణలో కూడా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డును అందజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియను ప్రారంభించారు.

పైలెట్ ప్రాజెక్టుగా ఒక్కొక్క నియోజకవర్గంలో మున్సిపాలిటీలోని ఒక వార్డును, గ్రామీణ ప్రాంతాలలోని ఒక గ్రామ పంచాయతీని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించారు.

కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను తీసుకోవడంతో పాటు వారి ఫోటో కూడా తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఈ డిజిటల్ కార్డు రేషన్ తో పాటు అన్ని సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తీసుకోనున్నారు.

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఐదు రోజులలో సర్వే పూర్తి చేసి ఈనెల 10వ తేదీన ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. దసరాకు డిజిటల్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనున్నది.

మిర్యాలగూడలో ..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డిజిటల్ కార్డుల పైలెట్ సర్వేను సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ప్రారంభించారు. మిర్యాలగూడ పట్టణంలోని 23వ వార్డు తో పాటు మండలంలోని రుద్రారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.

ఈ వివరాలు తప్పనిసరి :

పైలెట్ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ కార్డుల కోసం రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న సర్వేలో ప్రజల నుంచి 8 రకాల వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసేందుకు ఒక ఫారం నింపుతున్నారు. ఇంటింటికి వెళ్లిన వెళ్లి రెవెన్యూ అధికారులు కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు.

కుటుంబ సభ్యుల వద్ద తప్పనిసరిగా ఈ వివరాలు ఉంచుకొని అధికారులకు తెలియజేయాల్సి ఉంది. వాటిలో కుటుంబ సభ్యుడి పేరు, లింగం, వయస్సు, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో ఉన్న బంధుత్వం, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, అడ్రస్ తెలియజేయాల్సి ఉంది వీటితోపాటు కుటుంబ సభ్యుల ఫోటోను అధికారులు సేకరిస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు