ఒకే ఒక్కడు.. ఆ జిల్లాలో ఉన్న ఒక్క పోస్టుకు టాపర్ గా నిలిచిన యువకుడు..!
ఒకే ఒక్కడు.. ఆ జిల్లాలో ఉన్న ఒక్క పోస్టుకు టాపర్ గా నిలిచిన యువకుడు..!
అర్వపల్లి, మనసాక్షి :
ప్రభుత్వం జారీ చేసిన DSC నోటిఫికేషన్ లో ఆ జిల్లాలో ఆ ఉపాధ్యాయ ఉద్యోగం ఒక్కటే ఖాళీ ఉంది. దానిని సాధించాలంటే టాప్ ర్యాంకు రావాలి. పేదరికంలో ఉన్నా కూడా టాప్ ర్యాంకు సాధించి ఒకే ఒక్కడుగా నిలిచాడు.
ఈనెల 30 న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అభ్యర్థి తన సత్తా చాటుకున్నారు. డిఎస్సిలో ఎంపికలో భాగమైన ఫిజికల్ డైరెక్టర్(స్కూల్ అసిస్టెంట్) విభాగంలో)జిల్లాలో ఉన్న ఒకే ఒక్క పోస్టుకు అతను ఎంపికై ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపారు.
జిల్లాకే ఆదర్శం :
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన చెరుకు తిరుపతయ్య – భారతమ్మ దంపతుల కుమారుడైన చెరుకు నాగేందర్ ఎం.పిఈడి ట్రైనింగ్ పూర్తి చేశాడు. అందుకు ప్రభుత్వం ఉద్యోగ వేటలో ఉన్న అతను ప్రభుత్వం ఆగష్టు 5న నిర్వహించిన DSC పరీక్ష రాశాడు.
కాగా ఈనెల 30 న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో అతను ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్ అసిస్టెంట్)పోస్టుకు ఎంపికయ్యారు. అట్టి పోస్టుకి 63 మార్కులతో టాపర్ గా నిలిచి సూర్యాపేట జిల్లాలో ఉన్న ఒకే ఒకటి పోస్టుకు నెంబర్ ర్యాంక్ సాధించడంతో ఎంపికయ్యారు.
LATEST UPDATE :
-
Rythu Bharosa : రైతు భరోసా కు మీరు అర్హులేనా.. నిబంధనలు ఖరారు..!
-
Cm Revanth Reddy : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి..!
-
Morning Drinks : టాప్ 7 మార్నింగ్ డ్రింక్స్.. అధిక కొలెస్ట్రాల్ మాయం, గుండె భద్రం..!
-
Bigg Boss 8 Telugu : సోనియాకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. షాకింగ్









