TOP STORIESBreaking Newsవ్యవసాయం

Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!

Cm Revanth Reddy : రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. రూ.500 బోనస్ అందరికీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.

హామీలలో భాగంగానే రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ఈ సీజన్ నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలోని రైతులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. ఈ సీజన్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన ధాన్యంకు బోనస్ ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సీజన్ నుంచి సన్నధాన్యాలు పండించిన రైతులందరికీ కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) కి అదనంగా ఒక్కొక్క క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల లోపే వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 7000 పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. వాటి బాధ్యత జిల్లా కలెక్టర్లు చూడాలని, అవసరమైన చోట అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సీజన్ లో 66 .73 లక్షల ఎకరాల్లో వరి పంటలు సాగు చేయగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సన్న ధాన్యంకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాబట్టి ఎక్కడ పొరపాటు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సంచులపై తప్పనిసరిగా కేంద్రం నెంబరు ఉండాలన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయించకూడదని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో కోనే సంచులు, తార్పాలిన్లు, మాయిచ్చర్ మిషన్లు, డ్రైవర్లు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులు ఏవైనా సమస్యలు ఉంటే 24/7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు