Indiramma Gruhalu : పేదలకు భారీ గుడ్ న్యూస్.. మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ గృహాలు..!

Indiramma Gruhalu : పేదలకు భారీ గుడ్ న్యూస్.. మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ గృహాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తులు ఇస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించేందుకు అంతా సిద్ధమైంది.
పేదలందరికీ మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయనున్నారు. అందుకు గాను ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇందిరమ్మ కమిటీలలో స్థానిక గ్రామ సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీలలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉంటారు. అదేవిధంగా స్థానికులైన ముగ్గురిని మరో ఇద్దరిని మహిళ సంఘాలకు సంబంధించిన మహిళలను కమిటీలు నియమిస్తారు.
ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయటానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల గృహాలను మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరు అయిన పేదలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
దసరా పండుగ సందర్భంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ కానున్నది. కమిటీలు ఏర్పాటు కాగానే ఇందిరమ్మ ఇండ్లు చేయనున్నారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి.
LATEST UPDATE :









