తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : ఉపాధ్యాయ MLC ఓటరు నమోదు ప్రారంభం..!

Miryalaguda : ఉపాధ్యాయ MLC ఓటరు నమోదు ప్రారంభం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ఉపాధ్యాయ శాసనమండలి ఓటరు నమోదు కార్యక్రమం పిఆర్ టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యడవల్లి దామోదర్ రెడ్డి ప్రారంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో ఉన్నత విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలని, దీనికి 1 నవంబర్ 2018 నుంచి 30 అక్టోబర్ 2024 మధ్యకాలంలో ఉన్నత విద్యాసంస్థల్లో మూడు సంవత్సరాలు పని చేసినటువంటి వారు అర్హులని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గతంలో నమోదైనటువంటి ఓటర్లు కూడా ప్రస్తుతం నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఓటర్ నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటరు గుర్తింపు కార్డు, చిరునామా తదితర వివరాలతో పిఆర్ టియు మిర్యాలగూడ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు కందుల వెంకటరెడ్డి, గుర్రం రమేష్,జిల్లా బాధ్యులు గుడిపాటి కోటయ్య, అంబటి శ్రీను లను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి.శిరీష, ఉపాధ్యాయులు గుడిపాటి కోటయ్య, పోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వట్టె మాధవి, టి. శ్రీనివాస రెడ్డి, జలరాం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు