TOP STORIESBreaking News

TG News : ఇందిరమ్మ ఇళ్ళకు మీరు అర్హులేనా.. ఎంపిక ఎలా.. కమిటీలు ఎం చేస్తాయి..! 

TG News : ఇందిరమ్మ ఇళ్ళకు మీరు అర్హులేనా.. ఎంపిక ఎలా.. కమిటీలు ఎం చేస్తాయి..! 

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం దీపావళితో ప్రారంభం కానున్నది. దీపావళి పండుగ రోజు పేదలకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారు అనే విషయంపై ఆయన వెల్లడించారు. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు..? ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు..? అనే విషయం తెలుసుకుందాం..

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్ రూపొందించనున్నది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగనున్నది. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు  విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఈ యాప్ ను శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మరో రెండు రోజుల్లో యాప్ లో పూర్తిస్థాయిలో మార్పులు చేసి దానిని ప్రారంభించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల కమిటీల బాధ్యత ఏమిటి :

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామీణ ప్రాంతాలు, మున్సిపల్ ప్రాంతాలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో గ్రామ సర్పంచి లేదా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ చైర్మన్  ఉంటారు. మున్సిపల్ స్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్ ఉంటారు.

వారితో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో నుంచి ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు మహిళలు వారిలో ఒకరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. వార్డు ఆఫీసర్ లేదా పంచాయతీ ఆఫీసర్ కార్యదర్శి / వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా కమిటీలో ఉంటారు.

ఇందిరమ్మ కమిటీలు.. ఈ పథకంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు అర్హులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చేపట్టనున్నారు.  నిర్మాణానికి డబ్బులు నేరుగా లబ్ధిదారుడికి అందించనున్నారు కమిటీ ఈ పథకంపై సోషల్ ఆడిట్ చేయనున్నది. అనరులకు ఇళ్ళను మంజూరు చేస్తే ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు ఈ కమిటీ ద్వారా చేయవచ్చును. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా 4.5 లక్షల రూపాయలను ఇవ్వనున్నారు.

LATEST UPDATE :

 

మరిన్ని వార్తలు