Suryapet : మంత్రి పొంగులేటి మొదటి బాంబు వారి మీదనా.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!
Suryapet : మంత్రి పొంగులేటి మొదటి బాంబు వారి మీదనా.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..!
సూర్యాపేట, మన సాక్షి:
కొరియా నుంచి వచ్చిన పొంగులేటి అన్నట్టుగానే మొదటి బాంబును గ్రామీణ ప్రజల గుండెల్లో దించాడని.. రూరల్ ప్రాంత రోడ్లన్నీ బడాబాబులకు కట్టబెట్టే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతుందని.. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు విధానాలే పాటిస్తున్నారు. తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేసే సోయిలేదని మాజీమంత్రి, సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్బంగా ఆయన ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్ ఇచ్చామని.. 60 ఏండ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి.. కేవలం పదేండ్లలో అద్భుత ప్రగతి సాదించిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారి పై బాంబులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోమారు తన విషబుద్ధిని ప్రదర్శించిందన్నారు. ఈ నిర్ణయంతో అన్ని రంగాల ప్రజలతో పాటు ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుందన్నారు.
క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెడితే ప్రజల పై మరింత భారం మోపినట్లయిద్దన్నారు. క్యాబినెట్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. బి ఆర్ ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాదుతుందన్నారు. రాష్ట్రాన్ని దోచి బడాబాబులకు కట్టబెటాలని చూస్తున్న కాంగ్రెస్ కుట్రలను అడుగడుగునా ఎండగడతామన్నారు.
ప్రజల బతుకుల్లో చీకటి నింపే దుర్మార్గ ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్సరించారు. తమ హయాంలోనే గ్రామాల నుండి పట్టణాలకు, పట్టణాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాలనుంచి రాజధానికి అనువైన కనెక్టింగ్ రోడ్లు వేశామన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే మూసీ దోపిడీ కుట్ర జరిగిందని.. ఇప్పుడు రోడ్ల పై పడ్డారని.. రోడ్ల లానే విద్యుత్ ని కూడా కార్పొరేట్ల చేతుల్లో పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆర్ ర్టీసీ తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆటో సోదరుల జీవితాలు మరింత దుర్బరంగా మరతాయన్నారు. రాష్ట్రం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుందని.. ముందుముందు ప్రపంచ బ్యాంకుకి అప్పగిస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఇళ్ల నుండి బయటకు వెళ్తే ఇక పై టాక్సులు కట్టాల్సిన దుస్థితి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని.. ఏ ప్రాతిపదికన రోడ్లు కేటాయిస్తారో పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఇదే విధానం కొనసాగితే ఇక ఒక్కో జిల్లా ఒక కాంట్రాక్టర్ చేతుల్లోకి వెళ్తుందని.. దీని బి ఆర్ ఎస్ పార్టీగా అడ్డుకుంతామని.. ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ కుట్రపూరిత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.
LATEST UPDATE :









