Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంక్షేమంహైదరాబాద్

TG News : మళ్లీ ప్రజా పాలన.. మరోసారి దరఖాస్తులకు ఆహ్వానం..!

TG News : మళ్లీ ప్రజా పాలన.. మరోసారి దరఖాస్తులకు ఆహ్వానం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రజా పాలన నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా పేద ప్రజలను గుర్తించి అర్హులైన వారందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తుంది. దాంతో పాటు అదేవిధంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కల్పించారు.

ఇదిలా ఉండగా ప్రజాపాలన దరఖాస్తులు అనేక మంది ప్రజలు తప్పులు నమోదు చేసుకోవడంతో పాటు చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. దాంతో ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ దూరమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కీలకంగా భావించి మరోసారి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది.

గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అంతే కాకుండా గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు అన్ని పథకాలకు అప్లికేషన్?లో భర్తీ చేయనప్పటికీ ప్రస్తుతం నిర్వహించే ప్రజా పాలనలో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చును.

హైదరాబాదులోని ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాలలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది.

దరఖాస్తుదారుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా పొంది ఉండాల్సి ఉంది. గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకునే వారు గ్యాస్ బుక్, డెలివరీ స్లిప్ తో పాటు గ్యాస్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ కార్డును అందజేయాల్సి ఉంది. ప్రజా పాలన దరఖాస్తుల ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగుతుందని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం విధితమే. కాగా మరోసారి ప్రజాపాలనకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు