Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : దేవరకొండ లో పర్యటించిన శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులు..!

Devarakonda : దేవరకొండ లో పర్యటించిన శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులు..!

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ పట్టణంలో శనివారం శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులు పర్యటించారు. అర్బన్ డెవలప్మెంట్, వివిధ రకాల సంక్షేమ పథకాలపై సుధీర్ణ విశ్లేషణ జరిపిన అనంతరం మహిళా సంఘాల సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రిసోర్స్ పార్క్ను ను సందర్శించిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని వివిధ సెక్షన్ల అధికారులతో ముకుమ్మడి చర్చలు జరిపారు. ప్రభుత్వ పథకాల తీరును, వాటి అమలును అడిగి తెలుసుకున్నారు.

శిక్షణ సివిల్ సర్వీస్ బృందం మాట్లాడుతూ యువ పాలకవర్గం అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు పక్కాగా అమలు చేస్తుందని తెలిపారు. మొక్కల పెంపకం, గ్రామస్థులకు తాగునీరు, రహదారుల నిర్వహణ తదితర అంశాలు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి , మున్సిపల్ ఏఈ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సకృ నాయక్, పి ఎం సి జగమంతు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు