Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : సాయి సన్నిధిలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!

Nalgonda : సాయి సన్నిధిలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!

చింతపల్లి, మనసాక్షి:

దైవచింతన తో మానసిక ప్రశాంతత పొందవచ్చునని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్లో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజలతో ముఖాముఖి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక సాయి మందిరంలో బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచి కంటి ధనంజయ, కమిటీ సభ్యులు, వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శనం చేపించారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మొదటిసారిగా విచ్చేసి బాబాను దర్శించుకున్న జిల్లా ఎస్పీ శరత చంద్ర పవర్ ఆలయ కమిటీ సభ్యులు శాలువాల తో ఘనంగా సన్మానించి సాయిబాబా ప్రతిమను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తులో ఈ దేవాలయం మరో శిరిడి దేవాలయం గా మారనున్నదని, రహదారి హైదరాబాదుకు సమీపంలోని ఈ రహదారి వెంట ఎర్ర కలపడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లోఈ దేవాలయం మును ముందు మరింత దేదీప్యమానంగా వెలుగొందుతుందని వారు పేర్కొన్నారు.

అనంతరం ఆరు బయట ఉన్నటువంటి గోశాలను సందర్శించి గోవులకు గడ్డిని వేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటి ధనంజయను, ఆలయం కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వీరి వెంట దేవరకొండ డి.ఎస్.పి, నాంపల్లి సిఐ నవీన్ కుమార్ చింతపల్లి ఎస్ ఐ బి యాదయ్య, ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటి ధనంజయ, కోశాధికారి ఊరే కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కోమిరిశెట్టి వెంకటయ్య, తడక మళ్ల శ్రీనివాస్, కుంభం పుల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు