WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ప్రతి ఒక్కరికి ఉపయోగమే, అదేంటంటే..!
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ప్రతి ఒక్కరికి ఉపయోగమే, అదేంటంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్నారు. దీనిలో ఎప్పటికప్పుడు యూజర్స్ కు ఉపయోగపడే విధంగా మార్పులు, చేర్పులు చేస్తూ కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది.
వాట్సాప్ గోప్యతను కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరు వినియోగించే విధంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ మెసేజింగ్ యాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇది యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటుంది.
ఇన్ స్టాగ్రామ్ స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు మనకు నచ్చిన వ్యక్తులను @ సాయంతో ట్యాగ్ చేస్తుంటాం.. ఆ వ్యక్తికి మనం స్టోరీ పెట్టినట్లుగా నోటిఫికేషన్ అందుతుంది. వాళ్లు మన స్టోరీని వెంటనే చూస్తారు. అలాంటి ఫీచరే వాట్సాప్ లో ఇప్పుడు కొత్తగా వచ్చింది. దాంతో ఇకపై వాట్సాప్ లో స్టేటస్ పెట్టే సమయంలో మన ఫోన్ కాంటాక్ట్ లో నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయవచ్చును.
వాట్సాప్ లో స్టేటస్ అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ అనే బార్ కుడివైపున @ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయగానే మనకు వాట్సాప్ లోని కాంటాక్ట్ లు అన్నీ కనిపిస్తాయి. వెంటనే మీరు మీకు నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయవచ్చును.
స్టేటస్ అప్డేట్ లో మెన్షన్ చేసే వారికి దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. అయితే ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు. వినియోగదారుల గోప్యత కూడా ఎలాంటి భంగం కలగకుండా ఈ ఫీచర్ ను కొత్తగా రూపొందించింది. మెన్షన్ అనే కొత్త ఫీచర్ అందరి యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
MOST READ :
-
Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?
-
UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
-
దీపావళి వేడుకల్లో కాళ్లు మొక్కి కాల్పులు.. మేనమామ, మేనల్లుడు మృతి.. (వీడియో)
-
Viral Video : వడ్డానం అనుకుందాం ఏంది..? పాముని పట్టుకుని అలా చేసింది.. (వీడియో)
-
TG News : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి శుభవార్త..!









