దీపావళి వేడుకల్లో కాళ్లు మొక్కి కాల్పులు.. మేనమామ, మేనల్లుడు మృతి.. (వీడియో)
దీపావళి వేడుకల్లో కాళ్లు మొక్కి కాల్పులు.. మేనమామ, మేనల్లుడు మృతి.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న వేళ.. ఇద్దరు అగంతకులు వచ్చి కాళ్లు మొక్కి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షహదారాలు నివాసం ఉంటున్న ఆకాష్ శర్మ (44) అతని మేనల్లుడు రిషబ్ శర్మ (16) గురువారం రాత్రి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇంటిముందు టపాసులు కాలుస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పై వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఆకాష్ శర్మ కు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అంతలోనే అతనికి అనుమానం వచ్చి ఇంట్లోకి పరిగెత్తాడు. కాగా పరిగెత్తిన ఆకాష్ శర్మను మరో వ్యక్తి కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
తుపాకీ పేలిన శబ్దం వినగానే మేనల్లుడు రిషబ్ శర్మ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దాంతో నిందితుడు అతడు పై కూడా కాల్పులు జరిపాడు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా ఆకాష్ శర్మ, రిషబ్ శర్మ మరణించినట్లుగా వైద్యులు పేర్కొన్నారు.
Farsh Bazaar double murder cctv
A man and his cousin shot dead while celebrating Diwali. #delhimurder #DelhiPolice #Delhicrime pic.twitter.com/Z8b4iFkS3f— Shehla J (@Shehl) November 1, 2024
MOST READ :
-
Viral Video : వడ్డానం అనుకుందాం ఏంది..? పాముని పట్టుకుని అలా చేసింది.. (వీడియో)
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!
-
UPI : యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా.. అయితే కొత్త రూల్స్ నేటి నుంచే.. తెలుసుకోండి..!
-
Viral Video : టపాసులు ఇలా కూడా పేల్చొచ్చా.. బైకు ట్యాంకులో.. (వీడియో)









