తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావ్యవసాయం

District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్..!

District collector : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించారు.

ధర్మారం మండలం దొంగతుర్తి , ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డు, మల్లాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల ఇంచార్జి అధికారులు రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర పై వేగవంతంగా కొనుగోలు చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

వ్యవసాయ అధికారులు కోతల సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, హార్వెస్టర్ల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుండి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే సంబంధిత మిల్లులకు లేదా గోదాములకు తరలించాలని, ధాన్యం తరలింపులో ఎక్కడ వాహనాల కొరత రాకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల ,కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు