TG News : వేసవి రాకముందే.. మరో రెండు రోజుల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు.. ఇవే వేళలు..!
TG News : వేసవి రాకముందే.. మరో రెండు రోజుల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు.. ఇవే వేళలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో నిర్వహించాల్సిన ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ లోనే ఒంటిపూట బడులు నిర్వహించనున్నది. ఎందుకంటే రాష్ట్రంలో కూలగణన అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ప్రభుత్వం ఉపాధ్యాయులను వినియోగించుతుంది.
దాంతో ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొంటున్నందున పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఒంటి పూట బడులు నిర్వహించే సమయాన్ని అధికారులు నిర్ణయించారు.
కుల గణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల తో పాటు 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లను నియమించింది. దాంతో పాటు మరో 8000 మంది ఇతర సిబ్బందిని కూడా కుల గణన కు నియమించింది. కుల గణన సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ పాఠశాలలను ఒంటి పూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకుగాను ఈనెల 6వ తేదీ నుంచి ఉదయం 9 గంటల కు పాఠశాల ప్రారంభమై ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అనంతరం ఉపాధ్యాయులు కులగణన కోసం ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను ప్రభుత్వం నియమించింది.
అందుకోసం వారికి ప్రత్యేక కిట్లను కూడా అందజేశారు. ఈనెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. సర్వేకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణ కూడా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
MOST READ :
-
Miryalaguda : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
-
TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్..!
-
Free Gas Cylinder : ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ప్రతి ఒక్కరికి ఉపయోగమే, అదేంటంటే..!









