Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

TG News : 12 నుంచి ఒంగోలు గిత్తల బలప్రదర్శన..! 

TG News : 12 నుంచి ఒంగోలు గిత్తల బలప్రదర్శన..! 

నేలకొండపల్లి, మన సాక్షి :

కార్తీకపౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని, రాజేశ్వరపురం గ్రామంలో ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 12 నుంచి 15 వరకు జరగనున్న ఎద్దుల బలప్రదర్శన పోటీలకు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

తొలి రోజు పోటీలను మంత్రి ప్రారంభించనున్నట్లు నిర్వహాకులు తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన కు వస్తాయని నిర్వహకులు తెలిపారు. పోటీలకు సహకరిస్తున్న మంత్రికి నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.

రైతు సంబురాలకు అధిక సంఖ్యలో హాజరై విజయంతం చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరపురం సోసైటీ చైర్మన్ తన్నీరు కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ యర్రబోయిన నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ చిట్యాల రమేష్, దండా సత్యనారాయణ, దండా వెంకటేశ్వర్లు, రెడ్డిబోయిన నవీన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు