Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!

Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

అమెరికా ఎన్నికలు ముగిశాయి. మరోసారి డోనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. దాంతో డాలర్ విలువ మరింతగా పెరగడంతో పాటు రూపాయి విలువ తగ్గింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

బంగారం ప్రియులకు శుభవార్త లభించింది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో విలువల ప్రకారం బంగారం ధరలు స్థానిక మార్కెట్లలో కూడా భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు రూ.17900 తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు రూ. 16,500 తగ్గింది.

ఇంత భారీగా బంగారం ధరలు పడిపోవడం గత రెండు మాసాలుగా కూడా ఇదే ప్రథమం. 24 క్యారెట్స్ బంగారం ఒక గ్రాముకు 7856 రూపాయలు ఉండగా 22 క్యారెట్ కు గోల్డ్ కు 7200 ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర నవంబర్ 6వ తేదీన 80,350 ఉండగా గురువారం (నవంబర్ 7)వ తేదీన 1790 రూపాయలు తగ్గి 78,560 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ బంగారం ధర నవంబర్ 6వ తేదీన 73,650 రూపాయలు ఉండగా గురువారం (నవంబర్ 7)వ తేదీన 1650 రూపాయలు తగ్గి 72,000 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో (నవంబర్ 7) బంగారం ధరల వివరాలు :

22 క్యారెట్స్ బంగారం ధర :

ఒక గ్రాముకు రూ. 7200

8 గ్రాములకు రూ. 57600

10 గ్రాములకు రూ.72,000

100 గ్రాములకు 7,20,000 రూపాయలుగా ఉంది.

24 క్యారెట్స్ గోల్డ్ :

ఒక గ్రాము రూ. 7856

8 గ్రాములకు రూ. 62,848

10 గ్రాములకు రూ.78,560

100 గ్రాములకు 7,85,600 రూపాయలుగా ఉంది.

జాతీయ మార్కెట్లో బంగారం ధరలు

చెన్నైలో, ముంబై, కలకత్తా, బెంగళూరు హైదరాబాద్, కేరళ, పూణే రాష్ట్రాలలో 24 క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము రూ. 7856, 22 క్యారెట్స్ గోల్డ్ రూ.7200 ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు