Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు కార్తీక మాసంలో మొదటిసారి షాక్ తగిలింది. దీపావళికి ముందు బంగారం ధర విపరీతంగా పెరిగింది. రోజురోజుకు పెరుగుతూ పసిడి ప్రజలకు షాక్ గురిచేసింది. కాగా నవంబర్ 1వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు (నవంబర్ 5)వ తేదీ వరకు మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
కార్తీక మాసం ప్రారంభంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళల్లో ఆనందం కలిగింది. కానీ బుధవారం (నవంబర్ 6)వ తేదీన ఒకేసారి షాక్ కు గురిచేసింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర ఏకంగా 1100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 1000 రూపాయలు పెరిగింది.
22 క్యారెట్స్ తులం బంగారం నవంబర్ 5వ తేదీన 73, 550 రూపాయలు ఉండగా నవంబర్ 6వ తేదీన 73,650 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్స్ తులం బంగారం ధర నవంబర్ 5వ తేదీన 80,250 రూపాయలు ఉండగా నవంబర్ 6వ తేదీన 80,350 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్నాయి.
హైదరాబాదులో బంగారం ధరలు :
22 క్యారెట్స్:
ఒక గ్రాము బంగారం ధర 7365 రూపాయలుగా ఉంది.
8 గ్రాముల బంగారం ధర 58,920 రూపాయలుగా ఉంది.
10 గ్రాముల బంగారం 73,650 రూపాయలుగా ఉంది.
100 గ్రాముల ధర 7,36,500 రూపాయలుగా ఉంది.
24 క్యారెట్స్ ధర :
ఒక గ్రాముకు 8035 రూపాయలుగా ఉంది.
8 గ్రాముల బంగారం ధర 64,280 రూపాయలుగా ఉంది.
10 గ్రాముల బంగారం ధర 80,350 రూపాయలు.
100 గ్రాముల బంగారం ధర 8,03,500 రూపాయలు ఉంది.
MOST READ :
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
-
Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!
-
CM Revanth : స్పీడ్ పెంచిన సీఎం రేవంత్.. పుట్టిన రోజు నుంచి పాదయాత్ర..!









