District collector : ప్రభుత్వం ఓటీపీలు అడగదు.. లింకులు పంపదు, వివరాలకు కోడ్, జిల్లా కలెక్టర్ వెల్లడి..!
District collector : ప్రభుత్వం ఓటీపీలు అడగదు.. లింకులు పంపదు, వివరాలకు కోడ్, జిల్లా కలెక్టర్ వెల్లడి..!
నల్గొండ, మనసాక్షి :
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుండి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు 3970 ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేశామని, ఇందులో గ్రామీణ ప్రాంతంలో 3131, పట్టణ ప్రాంతంలో 839 ఎన్యుమరేషన్ బ్లాక్లు ఉన్నాయని చెప్పారు.
3832 మంది ఎన్యుమరేటర్లు,386 మంది సూపర్వైజర్ లను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5 లక్షల 3411 ఇండ్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే చారిత్రక కార్యక్రమామని, భవిష్యత్తులో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన డేటా వివిధ కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని ఆన్నారు.
సర్వే కోసం ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు ఆధార్, ధరణి, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని, దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, సమగ్ర కుటుంబ సర్వే సమాచారం అంతటిని గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికి ఈ సమాచారాన్ని ఇవ్వడం జరగదని, అలాగే ప్రశ్నల ద్వారా సేకరించిన వివరాలను జాగ్రత్తగా భద్రపరచడం జరుగుతుందని, అన్ని వివరాలు డేటా ఎంట్రీ నమోదు చేసి భద్రపరుస్తామని తెలిపారు.
ఇందుకు మండల, మున్సిపల్ స్థాయిలలో అందుబాటులో ఉన్న సుమారు 2,835 డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించామని, అవసరమైతే మరి కొంతమందిని గుర్తిస్తామని చెప్పారు. ఎన్యుమరేటర్లు దగ్గరుండి డేటా ఎంట్రీ చేయిస్తారని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు ఇంక్రిప్షన్ కోడ్ ఉంటుందని, అందువల్ల ఈ వివరాలన్నీ ఆటోమేటిగగా గోప్యంగా ఉంటాయన్నారు.
సర్వేకు సంబంధించి ప్రజలను ప్రభుత్వం ఇలాంటి ఓటిపి చెప్పమని అడగడం, లేదా లింకు పంపించడం వంటివి ప్రభుత్వం తరఫున చేయదని ,బ్యాంక్ ,ఆధార్ నంబర్ల వల్ల ఎలాంటి దుర్వినియోగం కాదని స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు సూక్ష్మస్థాయిలో పనికి వస్తాయని, అన్ని రెసిడెన్షియల్ ఆవాసాలలో వీటిని సేకరించడం జరుగుతుందని, శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశానికి సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ అశోక్ రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు ,మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సమక్షంలోనే సర్వే ఫామ్ నింపిన ఎన్యుమరేటర్..!
-
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
-
Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!
-
District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఏఈఓ సస్పెండ్, ఏవో మరో ఏఈఓ కు షోకాజ్..!









