Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
District collector : జిల్లా కలెక్టర్ సమక్షంలోనే సర్వే ఫామ్ నింపిన ఎన్యుమరేటర్..!
District collector : జిల్లా కలెక్టర్ సమక్షంలోనే సర్వే ఫామ్ నింపిన ఎన్యుమరేటర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. గ్రామంలోని ఓ ఇంటి దగ్గర జరుగుతున్న సర్వేను ఆమె దగ్గరుండి పరిశీలించారు.
కలెక్టర్ సమక్షంలోనే ఎన్యుమ రెటర్ సర్వే ఫారంలో కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేశాడు. సర్వే ఫారంలో ఏమైనా అనుమానాలు వస్తే నివృతి చేసుకుని పూర్తి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక సర్వే ఫారం నింపే వరకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఒక సర్వే ఫారం నింపి పూర్తి చేసేవరకు 20 నుంచి 30 నిముషాల సమయం పడుతుందని సర్వే సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వినోద్, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!
-
RRC : రాత పరీక్ష లేకుండా టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. 5647 ఖాళీల భర్తీ..!
-
Family Survey : ఎక్కడుంటే అక్కడే సర్వే.. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి..!
-
District collector : నల్గొండ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఏఈఓ సస్పెండ్, ఏవో మరో ఏఈఓ కు షోకాజ్..!









