Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : హైదరాబాదులో విషాదం.. మియాపూర్ లో మిస్సయిన మైనర్ బాలిక.. తుక్కుగూడలో మృతదేహం లభ్యం..!
Hyderabad : హైదరాబాదులో విషాదం.. మియాపూర్ లో మిస్సయిన మైనర్ బాలిక.. తుక్కుగూడలో మృతదేహం లభ్యం..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
మియాపూర్ పిఎస్ పరిధిలో విషాదం నెలకొంది. మియాపూర్ టేక్ అంజయ్య నగర్ కి చెందిన మైనర్ బాలిక ఐశ్వర్య (17) ఈ నెల 8 న అదృశ్యం అయ్యి తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ ప్రాంతం లో శవమై కనిపించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 8 వ తేదీన బాలిక అదృశ్యం అయినట్లు మియాపూర్ పీయస్ లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉన్నట్లు గుర్తించారు.
తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించిన పోలీసులు. అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానం. కుటుంబ సభ్యులు ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం అయిన ఉప్పుగూడకు చెందిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Gold Price : తగ్గినట్టే తగ్గి పెరిగిన పసిడి.. తులం బంగారం ధర ఎంతంటే..!
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
PI Phone : ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్.. డిసెంబర్ లో లాంచ్, తెగ వైరల్..!
-
Rythu : రైతులకు అదిరిపోయే న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బులు..!









