TOP STORIESBreaking Newsసంక్షేమం

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఖరారు.. ఇక లబ్ధిదారుల ఎంపికే.. మీరు అర్హులేనా..!

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఖరారు.. ఇక లబ్ధిదారుల ఎంపికే.. మీరు అర్హులేనా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఖరారయ్యాయి. ఇంకా కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కేవలం రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో ఎంపిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తికాగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

నవంబర్ చివరి వారంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం సర్వే కారణంగా డిసెంబర్ కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80, 54, 554 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు ఇళ్ల లబ్ధి పొందిన కుటుంబాలు 12, 72, 019 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. గతంలో లబ్ధి పొందిన వారికి ఇందిరమ్మ ఇచ్చే ఛాన్స్ లేదు. కాగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేకంగా దరఖాస్తులు చేసుకోవలసిన అవసరం లేదు.

ప్రజా పాలన దరఖాస్తుల తోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

లబ్ధిదారుల ఎంపిక మాత్రం గ్రామసభల ద్వారానే ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీలను కూడా పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్ లో గ్రామపంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేయనున్నారు. మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు దశలలో 5 లక్షల రూపాయలను అందజేయనున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నది.

MOST READ : 

మరిన్ని వార్తలు