Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Thummala : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.. ఏ రోజుకు ఆ రోజే ధాన్యం కొనుగోలు..!

Thummala : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.. ఏ రోజుకు ఆ రోజే ధాన్యం కొనుగోలు..!

నలగొండ, మన సాక్షి :

రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేయకుండా ఈరోజు వచ్చిన ధాన్యం ఆరోజే కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుకుగాను కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు.

సరైన శాతం, నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి దాన్యం వచ్చిన రోజే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు . ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అంతేకాక కొనుగోలు కేంద్రానికి వచ్చిన దాన్యం తేమ శాత్యాన్ని తేమ కొలిచే యంత్రం ద్వారా పరిశీలించారు.

అనంతరం కేంద్రం నిర్వాహకురాలితో మంత్రి మాట్లాడుతూ తేమ సరిగా వస్తున్నదా? తూకం సరిగా చేస్తున్నాదా? అని అడిగారు. అంతేగాక సరైన తేమ,నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి అదే రోజే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలన్నారు .దాన్యం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు .

కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యాన్ని ఎప్పటికప్పుడే కొనుగోలు చేయడం, ధాన్యం అమ్మిన రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తుండడం పట్ల మంత్రులు అభినందించారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రుల వెంట ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు