Ration Cards : తెల్ల రేషన్ కార్డుదారులకు షాక్..!
Ration Cards : తెల్ల రేషన్ కార్డుదారులకు షాక్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ తెలిసిందే. ఇటీవల మంత్రులు కూడా 2025 జనవరి మాసంలో సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనట్లు ప్రకటించారు.
కానీ జనవరి మాసం నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. సన్న బియ్యం పంపిణీ సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం సన్నధాన్యం సేకరణ ఈ ఖరీఫ్ నుంచే ప్రారంభించింది. దాంతో ఖరీఫ్ ధాన్యంతో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అందజేయడానికి మరింత గడువు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే రైస్ మిల్లులకు చేరుతున్న సన్నధాన్యంలో బియంగా తయారయ్యి గోదాములకు పంపే వరకు గడువు పట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇప్పుడే వచ్చిన బియ్యం కూడా కొత్త బియ్యంగా అన్నం ముద్దయ్యే పరిస్థితిలో ఉంటాయి.
కొత్త బియ్యం అన్నం ముద్దగా మారే అవకాశాలు ఉన్నాయని సివిల్ సప్లై కమిషనర్ చౌహన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన మాటల్లో జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ సాధ్యపడే అవకాశాలు లేవని తెలుస్తుంది. కనీసం మూడు మాసాలైనా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
అంటే సంక్రాంతి నుంచి కాకుండా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఏడాది పాటు పంపిణీ చేయడానికి గాను 24 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంది.
కానీ వానాకాలం సీజన్ లో అంత సేకరణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాగా రబీలో కూడా సన్న బియ్యం కోసం సన్న ధాన్యం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
MOST READ :
-
జిమ్ లో ఇలా చేస్తావా..? వైరల్ అవుతున్న వీడియో.. తీవ్ర విమర్శలు..!
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Toll Tax : ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హత ఉంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..!









