ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఇంజనీర్..!
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన ఇంజనీర్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు ఓ కాంట్రాక్టర్ నుంచి 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీసీ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.
పెద్దపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న సాయి శ్రీ జిరాక్స్ సెంటర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాంట్రాక్టర్ నేటి పారుదల శాఖలో నిర్మాణాల పనులు చేశారు. దానికి సంబంధించిన కొలతల రికార్డు చేయడానికి, ఫైల్ పంపడానికి ఏఈ నర్సింగరావు డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.
ఎసిబి అధికారులు కాంట్రాక్టర్ కు డబ్బులు ఇచ్చి ఏఈకి ఇవ్వమని చెప్పడంతో జిరాక్స్ సెంటర్లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా నర్సింగరావు పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు నరసింగరావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
MOST READ :
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!









