Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఉద్యోగం

Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!

Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!

మన సాక్షి :

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, (రిక్రూట్మెంట్ & ప్రమోషన్) సెంట్రల్ ఆఫీస్ రెగ్యులర్ ప్రాతిపదికన సి.బి.ఐ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆయా శాఖల్లో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానించింది.

దరఖాస్తు ఎలా..?

అర్హులైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకో వచ్చును. డిసెంబర్ 14వ తేదీన ఆన్‌లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2025 రెండో వారంలో ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు ఫీజు 850 రూపాయలు, (జీఎస్టీ) ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 175 రూపాయలు, (జీఎస్టీ) చెల్లించాలి. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్‌సైట్ సంప్రదించాలి.

అర్హత, ఎంపిక :

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీ ఉద్యోగాల దరఖాస్తులకు పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ / బి.టెక్/ బీ ఈ / ఎంసీఏ / డిప్లమా ఉత్తీర్ణతతో పాటు పనిలో రెండు సంవత్సరముల అనుభవం ఉండాలి. 23 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య వారై ఉండాలి. ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.

MOST READ : 

మరిన్ని వార్తలు