నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల.. ఎంఈఓ ఆకస్మిక తనిఖీ, షోకాజ్ నోటీసు..!
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల.. ఎంఈఓ ఆకస్మిక తనిఖీ, షోకాజ్ నోటీసు..!
ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మండల విద్యాధికారి పాండు పలు పాఠశాలల లో సాధారణ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆమనగల్లు పట్టణంలోని రిషి టాలెంట్ స్కూల్ ని సందర్శించారు.
గతంలో నవంబర్ 11 న సందర్శించి నప్పుడే అక్కడ విద్యార్థులకు సంబంధించిన మూత్ర శాలలు దుర్గంధంతో నిండి ఉండడం కనీసం తలుపులు కూడా లేకుండా ఉండడం చూసి దాన్ని సరి చేయాలని సూచించారు. అయినను విద్యాసంస్థ నిర్వాహకులు స్పందించక దాన్ని అలాగే వదిలేశారు.
సోమవారం ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో వాటి పరిస్థితి ఎలా ఉంది అని చూడగా అలానే దుర్గంధ స్థితిలో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్న విషయాన్ని ఆయన గమనించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారని సదరు విద్యాసంస్థ నిర్వాహకులను మండల విద్యాధికారి పాండు ఆదేశించారు.
అదే విధంగా రిషి టాలెంట్ పాఠశాల యాజ మాన్యం ఆ విద్యార్థులని వారు అనుమతి పొందిన భవనంలో కాకుండా మరోచోట నిబంధనలకు విరుద్ధంగా ప్రైమరీ పాఠశాలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అదే విధంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా హాస్టల్ ను సైతం నిర్వహిస్తున్నట్లు తనిఖీలలో స్పష్టమయింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను వసతి గృహలను నిర్వహిస్తున్నందుకు వివరణ ఇవ్వాలి అని షోకాజ్ నోటీస్ ని జారీ చేశారు. దీని పై జిల్లా విద్యాధికారికి నివేదిస్తామని ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు వసతులు కల్పించాలి.ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా పాఠశాలలు నిర్వహించాలి అని తెలియజేయడం జరిగింది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా అప్పుడే.. స్పష్టం చేసిన మంత్రి..!
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
Asara : ఆసరా పింఛన్ల పెంపుకు ముహూర్తం.. రూ. 4 వేలు, రూ. 6 వేలు పెంపుకు కసరత్తు..!
-
Miryalaguda : చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం.. హార్టికల్చర్ లో సీటు వచ్చినా.. ఫీజు కట్టలేక కూలి పనికి..!









