Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టనున్నది. అందుకుగాను అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన సర్వే శుక్రవారం నుండి ప్రారంభమైంది. సర్వే యాప్ లో పలు అంశాలను సర్వే చేయనున్నారు. సర్వే అంశాల ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు అనే విషయం తేలనున్నది. దాని ఆధారంగా ఇంటి నిర్మాణానికి మంజూరు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను తొలివిడతగా మంజూరు చేయనున్నారు. ముఖ్యంగా నిరుపేదలైన వారికి తొలి విడుదల ప్రాధాన్యత కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుడికి పెరిగిన నిర్మాణ ఖర్చుల ఆధారంగా ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నారు. అధికారులు చేపట్టే అంశాలు యాప్ లో అప్లోడ్ చేస్తారు.
ఆ అంశాలు పరిశీలిస్తే :
దరఖాస్తుదారుడు పేరు, ఆధార్ కార్డు నెంబర్, సొంత స్థలం ఉందా..? లేదా..? ఆదాయం ఎంత ఉంది..? గతంలో ఏదైనా గృహ నిర్మాణ పథకంలో లబ్ధి పొందారా.? ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, నివాసం ఉండే ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు..? దరఖాస్తుదారుడు వికలాంగులా / అనాధగా / ఒంటరి మహిళలా/ వితంతువులా / ట్రాన్స్ జెండర్ లా సఫారీ కర్మచారులా, బలహీన వర్గాలకు చెందిన వారా, అనే అంశాలను 32 రకాల వివరాలను సేకరిస్తారు.
సేకరించిన వివరాలన్నింటినీ యాప్ లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా దరఖాస్తుదారుడు ఇందిరమ్మ ఇంటికి అర్హుడా? కాదా..? అనేది నిర్ధారణ అవుతుంది.
అయితే దరఖాస్తుదారులు మొబైల్ నెంబర్, కరెంట్ బిల్లు, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి స్థలానికి సంబంధించిన ఫోటో, డాక్యుమెంట్లను యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి తోపాటు విచారణ సమయంలో లబ్ధిదారుడికి మూడు, నాలుగు చక్రాల వాహనాలు, ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు ఉన్నాయా..? లేవా..? అనేవి పరిశీలిస్తారు.
కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా..? ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా..? దాంతో పాటు గతంలో ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు మంజూరు అయిందా పరిశీలిస్తారు. ఈ సర్వే మొత్తం ఒక నెలలో పూర్తి చేయనున్నారు.
అయితే తొలివిడత సర్వేలో రేషన్ కార్డు లేకపోయినా ఆదాయ సర్టిఫికెట్ ఆధారంగా వర్తింపజేయనున్నారు. సర్వే ఆధారంగా ప్రత్యేక అధికారి గ్రామ లేదా వార్డు అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. మొదటగా భూమి లేని వ్యవసాయ కార్మికులు, వికలాంగులు, గుడిసె కూడా లేని వారికి ప్రాధాన్యత ఇస్తారు. డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ప్రూఫ్ లేని వారికి కరెంటు బిల్లు ఆధారంగా అగ్రిమెంటు సమర్పించాల్సి ఉంటుంది.
ఇండ్లను పూర్తిగా మహిళల పేరుతోనే మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం గదులు, వంటగది, మరుగుదొడ్డి కలిగి కనీసం 400 చదరపు అడుగులో స్లాబ్ ఏరియా ఉండాలి. అందుకు ప్రభుత్వం ఎలాంటి డిజైన్ కూడా సూచించడం లేదు.
ఇల్లు మంజూరైన తర్వాత నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నారు. బేస్మెంట్ లెవల్ లో ఒక లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్ వరకు ఒక లక్ష రూపాయలు, స్లాబ్ వేసేందుకు రెండు లక్షల రూపాయలు, ప్లాస్టింగ్ ఇతర ఖర్చులకు లక్ష రూపాయలు విడుదల చేస్తారు. లబ్ధిదారుడికి నచ్చిన రీతిలో ఇంటి నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించింది.
MOST READ :
-
Gest Lectures : అతిథి అధ్యాపకుల కొరకై దరఖాస్తుల ఆహ్వానం..!
-
CM Revanth Reddy : పేద ప్రజలకు పండుగ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..!
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!










