Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!
మన సాక్షి, అన్నమయ్య జిల్లా :
తరగతి బయటనే కాకుండా గదిలో కూడా విద్యార్థులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల ప్రవర్తన రోజురోజుకు దిగజారిపోతుంది. ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేకుండా పోతుంది. విలువలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. తరగతి గదిలోనే ఓ ఉపాధ్యాయుడిని 9 వ తరగతి విద్యార్థులు కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎజాస్ 9వ తరగతి విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థులు అల్లరి చేస్తున్నడంతో ఉపాధ్యాయుడు ఎజాస్ వారిని మందలించారు.
దాంతో విద్యార్థులు కోపంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. చాతిపై బలంగా కొట్టడంతో ఎజాస్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఏజాస్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్నప్పటికీ అతని ప్రాణాలు పోయాయి.
ఉపాధ్యాయుడు ఎజాస్ మరణ వార్త పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర దుఃఖానికి గురిచేసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Miryalaguda : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 7న జాతికి అంకితం.. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
-
చైతన్య విద్యా సంస్థలో విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులు.. తల్లిదండ్రుల ఆందోళన.!
-
Gold Price : ముగిసిన కార్తీక మాసం.. మళ్లీ పసిడి కి రెక్కలు..!
-
Miryalaguda : సంగం డైరీ ఎదుట స్థానికుల ఆందోళన.. కోదాడ – జడ్చర్ల హైవేపై భారీగా నిలిచిన వాహనాలు..!









