చైతన్య విద్యా సంస్థలో విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులు.. తల్లిదండ్రుల ఆందోళన.!
చైతన్య విద్యా సంస్థలో విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులు.. తల్లిదండ్రుల ఆందోళన.!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో శ్రీ చైతన్య సంస్థ కాలేజీ లు గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక వివాదం తో వార్తల్లో నిలుస్తున్నాయి. మదినాగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థినిలను వైస్ ప్రిన్సిపల్ శివ వేధింపులకు గురి చేస్తున్నాడని వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
కాగా మియాపూర్ ఎస్సై వెంకట్ కళాశాల ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడగా వారు పలు విషయాలను వెల్లడించారు. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోటోలు తీసి బెదిరించడం మార్కులు తగ్గిస్తానని పలు రకాలుగా ఇబ్బంది పెడూతున్నాడని స్టూడెంట్స్ ఆరోపించారు.
ఈ విషయం పై విద్యార్థినిల తల్లి తండ్రులు కాలేజ్ యాజమాన్యానికి పిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. అవసరం లేకపోయినా 7గం వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ..మీ మోఖాలకూ ఐపీ ఎగ్జామ్సే ఎక్కువ ఇంకా మెయిన్స్ అవసరమా మీకు అని తిట్టేవాడని, అంతేకాకుండా మంత్లీ 95% అటెండెన్స్ ఉండాలని లేకపోతే మర్క్స్ కట్ చేస్తామని పదే పదే బెదిరిస్తున్నారని విద్యార్థినిలు వాపోయారు.
మంత్ టైమ్ లొ కూడా ఇంటికి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ స్నాప్ చాట్ లొ ఇబ్బందికరంగా చాట్ చేస్తూ, లైంగికంగ వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న మియాపూర్ ఎస్సై కోన వెంకట్ కాలేజ్ చేరుకుని విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకున్నారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ శివ ను సస్పెండ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తల్లి తండ్రులు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :









