తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా

Vivek Vekataswami : సిసి రోడ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు..!

Vivek Vekataswami : సిసి రోడ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు..!

మందమర్రి రూరల్. మనసాక్షి :

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలకు గాను సీసీ రోడ్ల పనులకు ఒక కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం  పోన్నారం గ్రామంలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారంగాపల్లి చిచిర్రకుంట ఆదిల్పెట్ మామిడిగట్టు వెంకటాపూర్ పొన్నారం గ్రామపంచాయతీలకు ఒక కోటి 50 లక్షల రూపాయలతో సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇదే కాకుండా అంగన్వాడి భవన నిర్మాణాలకు పాఠశాలల ప్రహరీ గోడలకు గాను ఎన్ ఆర్ ఈ.జి.ఎస్ నిధుల నుండి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అలాగే డి.ఎం.ఎఫ్టి నిధుల నుండి కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మండల తహసిల్దార్. సతీష్ మండల ప్రజాపరిషత్ అధికారి రాజేశ్వర్. పొన్నారం కాంగ్రెస్ నాయకులు పెంచాల రాయలింగు మాసు సంతోష్ మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ సభ్యులు గ్రామాలలోని మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు