Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావైద్యంహైదరాబాద్

Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!

Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!

మన సాక్షి, హైదరాబాద్ :

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం లో శనివారం తెల్లవారుజామున ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెల్లడంతో ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు.

వివరాల ప్రకారం.. హైదరాబాదులోని హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన యువకులు ఎల్బీనగర్ నుంచి పోచంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున మంచు ఉండడంతో కారు అదుపుతప్పి జలాల్పూర్ మూలమలుపు వద్ద చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ సంఘటనలో ఐదుగురు యువకులు జల సమాధి కాగా ఒకరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. మృతులను వంశీ గౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్ గౌడ్ గా గుర్తించారు. మీరంతా 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే. మణికంఠ అనే యువకుడు క్షేమంగా బయటపడ్డారు.

శనివారం తెల్లవారు జామున వంశీ కారు డ్రైవింగ్ చేస్తుండగా 4.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు మణికంఠ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, రెండు పల్టీలు కొట్టి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు