Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్

Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!

Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. కార్తీకమాసం ముగిసిన నాటి నుంచి రోజుకు స్వల్పంగా పసిడి ధర పెరుగుతుంది. దాంతో మహిళల్లో నిరాశ కనబడుతుంది. గురువారం ధర స్వల్పంగా పెరిగింది. 100 గ్రాముల 22 క్యారెట్స్ కు 1000 రూపాయలు పెరగగా, 24 క్యారెట్ కు 1100 రూపాయలు పెరిగింది.

పెరిగిన ధరలు హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవే కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 10 గ్రాముల (తులం బంగారం) 22 క్యారెట్స్ గురువారం 71, 400 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 77, 890 రూపాయలు ఉంది.

మరో రెండు, మూడు రోజులు కూడా బంగారం ధరలు పెరుగుతాయని మహిళలు భావిస్తున్నారు. కార్తీక మాసంకు ముందుగా తులం బంగారం 80 వేల రూపాయల మార్కును దాటిన విషయం తెలిసిందే.

కాగా కార్తీకమాసం సీజన్లోనే భారీగా బంగారం ధర తగ్గి మహిళలకు శుభ పరిణామం కల్పించింది. కాగా మరోసారి స్వల్పంగా రోజురోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ 80000 రూపాయల మార్కుకు చేరుతుందా అని మహిళలు భావిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు