Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : మైలసముద్రం చెరువు నుంచి సాగునీటి విడుదల.. ఆనందంలో రైతులు..!

Nalgonda : మైలసముద్రం చెరువు నుంచి సాగునీటి విడుదల.. ఆనందంలో రైతులు..!

కనగల్, మన సాక్షి:

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ప్రధాన నీటి వనరైన కనగల్ మైలసముద్రం చెరువు నుంచి గురువారం నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఆయకట్టులో యాసంగి సాగు అవసరాల కోసం సాగునీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు నీటిని వృధా కాకుండా సాగు అవసరాల కోసం వాడుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిక్షం యాదవ్, మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు హఫీజుద్దీన్, నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈ ఈ సురేష్, జేఈ శాజియ,

మాజీ సర్పంచ్ లు నర్సింగ్ సునీత కృష్ణయ్య గౌడ్, బోగిరి రాంబాబు, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కరీముల్లా, మాజీ ఉప సర్పంచ్ పెద్దులు, శంకర్, మోహన్, వెంకన్న, లస్కర్లు నరేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు