Constable : ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదేనా..!
Constable : ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదేనా..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ శనివారం రాత్రి స్టేషన్ ముందున్న క్వార్టర్స్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాయికుమార్ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నారు. సాయికుమార్ రెండు సంవత్సరాల క్రితం కొల్చారం పోలీస్ స్టేషన్ కు హెడ్ కానిస్టేబుల్ గా బదిలీపై వచ్చాడు.
ఇతని స్వగ్రామం గుంటూరు జిల్లా చెందిన వాడు కాగా సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరగడంతో నర్సాపూర్ ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేశాడు. అక్కడే అతనికి సొంత ఇల్లు ఉంది.
ఇదిలా ఉండగా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధమే హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్యకు కారణాలుగా భావిస్తున్నారు. సాయికుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె డబ్బుల కోసం వేధిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయం రెండు రోజుల క్రితం స్టేషన్ వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో మనస్థాపానికి గురైన హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ శనివారం రాత్రి విధులకు హాజరై అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎస్సై క్వార్టర్స్ వెనుక భాగంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
MOST READ :
-
2024 Google Top Search in India : 2024 గూగుల్లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!
-
Beer : బీర్ ఆల్కహాల్ కాదా.. అక్కడ విచ్చల విడిగా బీర్ తాగుతారా..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!









