Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం సంక్రాంతి పండుగ నుంచి అమలు కాబోతుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు అ.యితే రైతు భరోసా పై విధివిధానాలను ఖరారు చేయడానికి పలు సమావేశాలు జరుగుతున్నాయి. ఈనెల 21వ తేదీన అసెంబ్లీలో రైతు భరోసా పై స్వల్ప చర్చ కూడా చేశారు.

ఇదిలా ఉండగా శనివారం (డిసెంబర్ 28వ) తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సెక్రటేరియట్లో రైతు భరోసా అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

సాగు చేసే భూమికి మాత్రమే పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో కచ్చితంగా ఉండే విధంగా ఉపగ్రహ డేటాను వినియోగించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామాలలోని సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల పేర్లను నమోదు చేయడంతో పాటు రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం హయాంలో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను అందించింది. ఇది ఇలా ఉండగా ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకాన్ని కొత్తగా తీసుకొచ్చి ఎకరానికి 15 వేల రూపాయలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రైతుబంధు పథకం ద్వారా సాగుకు యోగ్యం కానీ రాళ్లు, రప్పలు, గుట్టలు, చెట్లు ఉన్న భూములకు కూడా అమలు చేశారు.

దాంతో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను శాటిలైట్ సర్వే తో పాటు వ్యవసాయ అధికారుల సర్వే ఆధారంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఒక విడత 7500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు