Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్

TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!

TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!

మనసాక్షి :

మరో మూడు రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం  మందు బాబులకు శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మందు బాబులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు తెరవవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

వైన్ షాపులు మినహా బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లకు అనుమతిని అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ వేడుకల సమయంలో డ్రగ్స్ వాడకంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి.

ముఖ్యంగా GHMC పరిధిలో జరిగే ఈవెంట్లు మరియు పార్టీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించింది. ఈ ప్రకటనపై మందు డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Reporting :

Srinivas, Sharelingampally

MOST READ :

మరిన్ని వార్తలు