WhatsApp : ఒకే నెంబర్ తో రెండు ఫోన్లలో వాట్సప్ వినియోగం.. ఎలానో తెలుసుకుందాం..!
WhatsApp : ఒకే నెంబర్ తో రెండు ఫోన్లలో వాట్సప్ వినియోగం.. ఎలానో తెలుసుకుందాం..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ప్రస్తుతం వాట్సప్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. అతి ఎక్కువమంది వినియోగించే మెసేజింగ్ యాప్ లో వాట్సాప్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో వాట్సప్ ఒక భాగమైంది. అయితే ఇంతకాలం పాటు ఒక నెంబర్ తో ఒక ఫోన్ లో మాత్రమే వాట్సప్ వినియోగించుకోవడం సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఒక నెంబర్ తో రెండు ఫోన్లలో కూడా వాట్సాప్ ను వినియోగించుకోవచ్చును. అది ఎలాగో తెలుసుకుందాం…
వ్యాపారం గాని ఇతర అవసరాల కోసం ఒక వాట్సాప్ నెంబర్ వాడుతున్నప్పుడు వేర్వేరు పని సమయాల్లో వేరువేరు వ్యక్తులు వాడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పొరపాటున ఒక వ్యక్తి తనతో పాటు వాట్సాప్ నెంబర్ ఉన్న ఫోన్ తీసుకెళ్లినా.. రెండో డివైజ్ లో వాట్సాప్ ద్వారా కార్యకలాపాలు కొనసాగించవచ్చును. అంతే కాకుండా రెండు ఫోన్లు వాడేవారు ఒక ఫోన్ మాత్రమే బయటకు తీసుకెళ్లాలనుకుంటే ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.
ఎలా లింక్ చేయాలి..?
ఒకే నెంబర్ రెండు ఫోన్లలో వాట్సప్ కు లింక్ చేయాలంటే వాట్సప్ వెబ్ కు మన ఫోన్ కనెక్ట్ చేయడం గురించి అవగాహన చాలామందికి ఉండే ఉంటుంది. అలా సింపుల్ గా ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చును. అయితే వేరే ఫోన్ కు కనెక్ట్ చేయడం అనేది కాస్త భిన్నంగా ఉంటుంది.
ముందుగా మీ ప్రైమరీ ఫోన్ లో కుడివైపు ఉండే త్రీ డాట్స్ మెనూ ఓపెన్ చేయాలి. అందులో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. అయితే రెండో ఫోన్ తీసుకొని అందులో వాట్సప్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. లాగిన్ అయ్యే సందర్భంలో ఫోన్ నెంబర్ ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు త్రీ డాట్స్ ఓపెన్ చేసి అందులో కంపెనియన్ డివైజ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
అప్పుడు క్యూఆర్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. దాంతో ప్రైమరీ ఫోన్ తో స్కాన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రెండు ఫోన్లలో వాట్సప్ వినియోగించుకోవచ్చును. ఒకవేళ వేరే ఫోన్ లో వాట్సప్ అకౌంట్ వద్దనుకుంటే ప్రైమరీ ఫోన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించుకోవచ్చును. దీని ద్వారా ఓన్లీ మెసేజ్ లు మాత్రమే పంపుకునే వీలుంటుంది.. కాల్స్ మాట్లాడడం సాధ్యం కాదు.
MOST READ :
-
Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!
-
TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
Viral Song : పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన పై సెటైరికల్ సాంగ్.. వైరల్.. మీరు చూడండి.. (వీడియో)
-
Gold Price : నిలకడగా పసిడి ధర.. ఈరోజు తులం బంగారం ఎంతో తెలుసా..!









