Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల సమీపంలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
దేవరకొండ నుంచి నల్లగొండ వైపు వెళ్తున్న ఏపీ 21 జెడ్ 0192 నెంబర్ గల బస్సు బండి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జక్కుల మల్లేష్ యాదవ్ ను ఢీ కొట్టి ఈడ్చుకొని వెళ్ళింది. మల్లేష్ అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతి దేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Gold Price : పరుగులు పెడుతున్న గోల్డ్.. నూతన సంవత్సరంలో హ్యాట్రిక్..!
-
Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!
-
Good News : రైతులకు మోడీ భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.10వేలు..!









