Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
పట్టపగలు నాలుగు లక్షలు చోరీ..!

పట్టపగలు నాలుగు లక్షలు చోరీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రం లోని సెంటర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం నాలుగు లక్షల రూపాయలు దొంగతనం అయినవి. దామరగిద్ద మండలం కాన్ కుర్తి గ్రామానికి చెందిన పూజారి నారాయణ జి అనే వ్యక్తి మంగళవారం యూనియన్ బ్యాంక్ లో నాలుగు లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు.
తన సొంత ఊరికి వెళుతుండగా సెంటర్ చౌరస్తాలో ఉన్న గోల్డెన్ బేకరీ దగ్గర ద్విచక్ర వాహనం ఆపి బేకరీలో వస్తువులు తీసుకుంటుండగా ఎక్స్ఎల్ బైక్ పై బ్యాగులో ఉంచిన 4 లక్షల రూపాయల ను పల్సర్ పై వచ్చిన వ్యక్తులు అపహరించుకునిపోయినట్లు బాధితుడు తెలిపాడు.
తమ బంధువుల పెండ్లి కొరకు డబ్బులు తీసుకెళ్తున్నట్లు బాధితుడు తెలిపాడు. స్థానిక పోలీస్ స్టేషన్లోలో ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!
-
District collector : గ్రామీణ మహిళలు జాతీయస్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలి.. జిల్లా కలెక్టర్..!
-
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!










