CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!

CLP : సీఎల్పీ సమావేశంలో సంచలనం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. హైదరాబాదులోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
బిసి కుల గణన, ఎస్సీ వర్గీకరణ పై సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. ఈ రెండు నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఆ భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేత రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.
సీఎల్పీ సమావేశంలో స్థానిక ఎన్నికల బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఇదిలా ఉండగా సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేలు వారి ఇబ్బందులు, స్థానికంగా వారి సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
అయితే సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభ పక్ష సమావేశం అత్యంత కీలకం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేశారని తెలిపారు.
MOST READ :
-
Gold Price : తగ్గేదేలే.. పడిపోయిన బంగారం కొనుగోళ్లు.. అయినా ధర మళ్లీ రూ.2500 హైక్.. ఎందుకంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!
-
Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!









