Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
Rythu Bharosa : రైతు భరోసా.. 17.03 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.533 కోట్లు జమ.. చెక్ చేసుకోండి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. రైతు భరోసా పథకం పాతదే కావడం వల్ల ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదు. దాంతో రైతుల ఖాతాలలో రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను బుధవారం రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేసే కార్యక్రమం మొదలైంది.
వాస్తవానికి రైతు భరోసా పథకం జనవరి 26వ తేదీన ప్రారంభమైనప్పటికీ కేవలం మండలానికి ఒక గ్రామం చొప్పున మాత్రమే ఎంపిక చేసి ఆ గ్రామాలలో మాత్రమే రైతులకు జనవరి 27వ తేదీన రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ చేశారు. కాగా మార్చి 31వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకం అర్హులైన రైతులందరికీ అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు గాను బుధవారం నుంచి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం ప్రారంభమైంది.
బుధవారం ఒక్కరోజే 17.03 లక్షల మంది రైతుల ఖాతాలలో 533 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. జనవరి 27వ తేదీన 4.42 లక్షల మంది రైతుల ఖాతాలలో 593 కోట్ల రూపాయలను జమ చేయగా బుధవారం 17.03 లక్షల మంది రైతు ఖాతాలలో 533 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతు ఖాతాలలో 1126 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి.
ఎకరం పైబడిన రైతులకు కూడా త్వరలోనే రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఒకేసారి బ్యాంకు ఖాతాలలో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 40 లక్షల మందికి రైతు భరోసా అందే అవకాశం ఉంది.
MOST READ :









