Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోస పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోస పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం ప్రారంభించిన రైతు భరోసా పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందదరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పథకాన్ని కూడా ప్రారంభించారు.

తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాలలో నిలిచిపోయింది. దాంతో రైతుల పెట్టుబడి సహాయం సొమ్ము ఖాతాలలో వేయడం ఆలస్యం అవుతుంది. దాంతో రైతు భరోసా లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు తెలియజేసింది. రైతు భరోసా పథకంలో ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సహాయంగా అందజేస్తుండగా ఒక విడత 6000 రూపాయలను జమ చేయనున్నారు. మార్చి 31వ తేదీ వరకు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం వారి వారి ఖాతాలలో జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

MOST READ : 

  1. Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  3. Gold Price : రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ ధర.. ఒక్కరోజే రూ.11,500, ఈరోజు ధర ఎంతంటే..!

  4. Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!

మరిన్ని వార్తలు