Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!
Penpahad : కల్తీ విత్తనాలతో భారీగా నష్టం.. వ్యవసాయ అధికారులకు రైతు ఫిర్యాదు..!
పెన్ పహాడ్, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో నకిలీ విత్తనాలు వెలుగు చూశాయి. దాంతో ఆ రైతు లక్షల్లో నష్టపోయాడు. నకిలీ విత్తనాల విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ రైతు. వరిలో కల్తీ విత్తనాల కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని న్యూ బంజర హిల్స్ తండా కు చెందిన ధారావత్ అంజి నాయక్ రైతు నల్లగొండలో రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఎరువుల దుకాణంలో మహేంద్ర కంపెనీకి చెందిన 10 కేజీల సంచులు 25 వాటి విలువ 25000 వరి విత్తనాలు కొనుగోలు చేసినామని తెలిపినారు.
నారు పోసినారు 30 రోజుల నారు నాటు పెట్టగా 30 రోజుల వరి పొలం మొత్తం 60 రోజులలో వరి పొట్ట దిశకు వచ్చి కంకి బయటికి వచ్చి ఈనుతుందని రైతు తన ఆవేదనను వెలిబుచ్చినాడు. నాటేసిన 90 రోజులకు రావాల్సి ఉండగా.. ముందుగానే ఈనుతుందని దీంతో పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఇట్టి విషయంపై మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ కి గురువారం రైతు ఫిర్యాదు చేయగా వరి పొలాన్ని పరిశీలించినారు. రైతు ధారావత్ అంజి నాయక్ మాట్లాడుతూ వరి పొలం ముందుగానే ఈనుతోందని దీంతో పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవడంతో పంట నష్టం ఏర్పడుతుందని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పెరగకముందే కంకి పెట్టడంతో దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు.
సాగు కోసం సుమారు లక్ష పెట్టుబడి పెట్టినట్లు అవి కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు తమ పొలాన్ని పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పొలాన్ని పరిశీలించినాము సమస్యను వ్యవసాయ శాఖ ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏవో అనిల్ కుమార్ తెలిపినారు.
MOST READ :
-
TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
Miryalaguda : నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టు.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.. పిడి యాక్ట్ నమోదు..!
-
Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!
-
District collector : కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!










