Nalgonda : దర్వేశిపురం వైన్స్ సమీపంలో ట్రాఫిక్ జామ్..!
Nalgonda : దర్వేశిపురం వైన్స్ సమీపంలో ట్రాఫిక్ జామ్..!
కనగల్, మన సాక్షి:
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకాఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద గల వైన్ సమీపంలోని దర్వేశిపురం గ్రామం వెళ్లే దారిలో ఆదివారం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుమారు రెండు గంటలపాటు ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నల్గొండ జిల్లా కనగల్ మండల పరిధిలోని ధర్వేశిపురం లో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు ఆలయం వద్ద సుమారు 20 ఫంక్షన్ హాల్స్ కు పైగా ఉండడంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలు ఉన్నందున వేలాదిమంది అక్కడికి వచ్చారు.
ఈ క్రమంలో వైన్స్ సమీపంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇదిలా ఉంటే జిల్లాలో అత్యధిక డిమాండ్ కలిగిన వైన్స్ గా దర్వేశిపురం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ అధికారులు రెండో వైన్స్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. అమ్మవారి ఆలయం వద్ద రోజురోజుకు పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా రెండు వైన్స్ లకు పర్మిషన్ ఇవ్వాలని స్థానికుకు డిమాండ్ చేస్తున్నారు.
అమ్మవారు రెండు గ్రామాల పరిధిలో ఉన్నందున ధర్వేశిపురంకు ఒక వైన్స్, పర్వతగిరికి ఒక వైన్స్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఒకే వైన్స్ ఉన్నందున ఆ ప్రాంతంలో తీవ్ర జనసాంద్రత నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మందుబాబుల వీరంగంతో ఆ దారిలో వెళ్లాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.
MOST READ :
-
Nagarjunasagar : అప్పుడే ఖాళీ అవుతున్న సాగర్ జలాశయం.. ఎన్ని అడుగుల నీరుందో తెలుసా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
-
Suryapet : పెద్దగట్టుకు ఊరేగింపుగా తరలిన మకర తోరణం..!









