Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసంక్షేమం

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించేందుకుగాను ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది ప్రజా పాలన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో దరఖాస్తులు స్వీకరించింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరిలో సర్వే నిర్వహించారు.

సర్వే ఆధారంగా దరఖాస్తులను మూడు జాబితాలుగా తయారు చేశారు. వాటిలో L1, L2, L3 పేరుతో దరఖాస్తులను విభజించారు. అయితే వాటిని చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఒక వెబ్సైట్ ప్రారంభించింది. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ లో చెక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఇందిరమ్మ ఇంటికి చేసుకున్న దరఖాస్తు ఏ జాబితాలో ఉందో అనే విషయం తెలుసుకోవచ్చును

https://indirammaindlu.telangana.gov.in/applicantSearch

వెబ్సైట్ క్లిక్ చేసి ఫోన్ నెంబర్/ ఆధార్ నెంబర్/ రేషన్ కార్డు నెంబర్/ అప్లికేషన్ నెంబర్ ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఆ నెంబర్ టైప్ చేసి Go అని క్లిక్ చేస్తే మీ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ తెలుస్తోంది.

మొత్తంగా సర్వే ఆధారంగా L1 మొత్తం 21.93 లక్షల దరఖాస్తులు, L2 19.96 లక్షల దరఖాస్తులు, L3 33. 87 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2.43 లక్షల ఇళ్లను ఇంకా పరిశీలించాల్సి ఉంది.

దరఖాస్తు చేసుకున్న వారంతా వెబ్ సైట్ లో పరిశీలిస్తే తమ దరఖాస్తు ఏ స్టేజిలో ఉందో అనే విషయం తెలుస్తుంది. కానీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ L1,L2,L3 అంటే ఏందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అవేంటో చూద్దాం..

జాబితాలను పరిశీలిస్తే..

  • L1 ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. అదేవిధంగా ఖాళీ స్థలంతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల ఇండ్లు ఉన్న వారిని కూడా ఈ జాబితాలోనే చేర్చారు.

  • L2 సొంత స్థలం లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. వీరంతా ఖాళీ స్థలంతో పాటు ఎలాంటి ఇండ్లు లేని వారు.

  • L3 సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని ఈ జాబితాలో చేర్చారు.

MOST READ :

  1. Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!

  2. Suryapet : పెద్ద గట్టు జాతరకు అంతా సిద్ధం.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

  3. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!

  4. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..! 

  5. Suryapet : పెద్దగట్టుకు ఊరేగింపుగా తరలిన మకర తోరణం..!

మరిన్ని వార్తలు