Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!

Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే పథకాన్ని ప్రారంభించింది. ప్రజా పాలన ద్వారా గత ఏడాది దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా జనవరి మాసంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితాలను సిద్ధం చేసి గ్రామసభలలో వెల్లడించారు.

జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ సభలలో ప్రకటించిన జాబితాలో చాలామంది పేర్లు రాలేదని ఫిర్యాదులు చేయడంతో మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించారు. చాలామందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి.

అయితే మంజూరైన విషయం గానీ, ఏ జాబితాలో పేరు ఉందన్న విషయం చాలామందికి తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక వెబ్సైట్ ప్రారంభించింది.

దాంట్లో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా ప్రజా పాలన దరఖాస్తు నెంబర్ సహాయంతో చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. దానివల్ల ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో మీ పేరు ఉందా..? లేదా..? అనే విషయం తెలుసుకోవచ్చును.

ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
https://indirammaindlu.telangana.gov.in/applicantSearch
సెర్చ్ బై ఆధార్ నెంబర్/ ఫోన్ నెంబర్/ రేషన్ కార్డు/ అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. వాటిలో ఏదైనా ఓ నెంబర్ ఎంటర్ చేసి Go పై క్లిక్ చేస్తే దరఖాస్తు సంబంధించిన వివరాలు చూపిస్తుంది.

ఈ వివరాల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందా..? లేదా..? ఒకవేళ మంజూరు అయితే L1, L2, L3 ఏ జాబితాలో వచ్చింది. మన దరఖాస్తు ఏ దశలో ఉంది. అనే వివరాలు చూపిస్తుంది. అయితే దరఖాస్తుదారులకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నా ఈ వెబ్సైట్ ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయవచ్చును.

MOST READ : 

  1. TG News : రాహుల్ గాంధీ కులం పై చర్చ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్.. (వీడియో)

  2. Gold Price : భారీగా తగ్గిన బంగారం ధర.. ఇదే కొనుగోలుకు అదును..!

  3. Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు