తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : జనసంద్రమైన గొల్లగట్టు..!

Suryapet : జనసంద్రమైన గొల్లగట్టు..!

ఓ…లింగా… నామ స్మరణలతో మారు మొగుతున్న పెద్దగట్టు జాతర..

జాతర లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు, ప్రజలు.

సూర్యాపేట, మనసాక్షి

యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో రెండో రోజు చౌడమ్మ తల్లికి భక్తులు సాంప్రదాయరీతిలో బోనాలను అత్యంత వైభవంతో సమర్పిస్తున్నారు. ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశానుసారం పెద్దగట్టు జాతర నేపథ్యంలో తెలంగాణ తోపాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,ఛతీస్ ఘడ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ లకు చెందిన ప్రజలు కుల మతాలకు అతీతంగా శివసత్తుల నృత్యాలతో,పూలు పసుపు, కుంకుమతో పూజించిన గంపలతో,డప్పు దరువుల శబ్దాలకు నృత్యలు చేస్తూ ,ఓలింగా నామస్మరణాలతో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తున్నారు.

ఇప్పటికే సుమారుగా 3 లక్షలపైగా రెండు రోజులలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలో రవాణా శాఖ ద్వారా రెండు డి. పొ ల ద్వారా 100 కి పైగా ఆర్ టి సి బస్సు ల లో భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన 17 మెడికల్ క్యాంప్ లలో ప్రధమ చికిత్స సేవలు అందించటం తో పాటు అత్యవసర సేవల కొరకు అంబులెన్సు సర్వీస్ కూడా అందుబాటులో ఉంచటం జరిగింది.


జాతర లో భక్తులు కొరకు స్నానఘట్టాలు వద్ద నీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలించి నీటిని విడుదల చేయటం జరుగుతుంది.
జాతర లో రెండురోజులలో తప్పిపోయిన 25 మంది చిన్న పిల్లలను శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో వారి తల్లితండ్రులకి అప్పగించారు.
జాతరలో 2 వేల మంది పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చేసిన మార్గాల ద్వారా భక్తులని గుట్ట పైకి స్వామి వారి దర్శనానికి పంపించటం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ మళ్ళించి భక్తులకి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

పారిశుధ్య పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గుట్టపైన, పరిసర ప్రాంతాలలో నిరంతరం పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ జాతరలో పలు ప్రాంతాలను పరిశీలించి భక్తులు, ప్రజలకు అందుతున్న సౌకర్యలను ప్రత్యేక అధికారుల ద్వారా తెలుసుకొని ఎప్పడికప్పుడు దిశానిర్దేశ్యం చేస్తున్నారు.

అలాగే చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున కట్ట వైపు పిల్లలు, వృద్ధులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవటంతో పాటు నిరంతరం నీటి పారుదల శాఖ  అధికారులు, పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Reporting : MuthyamRaju, Suryapet 

MOST READ : 

  1. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  2. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

  4. Gold Price : తగ్గేదే లేదంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు