Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
BIG BREAKING : ఇరు వర్గాల ఘర్షణ టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్తు..!
BIG BREAKING : ఇరు వర్గాల ఘర్షణ టెన్షన్.. టెన్షన్.. పోలీసుల భారీ బందోబస్తు..!
నిజామాబాద్ జిల్లా ( భీంగల్).. మన సాక్షి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలోని ఇరు వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందర ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీ పెట్టడం వాళ్ళ ఈ సమస్య ఏర్పడింది అని చెప్తున్నారు.
పోలీసులు చెప్పగానే కాపు కులస్తులు ఫ్లిక్సీ ని తీసివేయడం జరిగింది. ఫ్లిక్సీ ఉన్న స్థలంలో నీటి కుండీని నిర్మించాలని కాపు కులస్తులు డిమాండ్ చేస్తున్నారు. డా బి ఆర్ అంబేద్కర్ ముందర నీటి కుండీ కాకుండా ప్రక్కన నిర్మించాలని మాలలు డిమాండ్ చేస్తున్నారు.
దీని వలన ఇరు వర్గాల మధ్య గొడవ దూరంగా వెళ్ళింది. దీనికి గ్రామ కాపు సంఘాలు అందరు రావడంతో శుక్రవారం ఉదయం నుంచి పోలీసుల భారీ బందోబస్తూ నిర్వహించారు. ఈ సమస్యను వెంటనే పరీక్షించాలని మాల, మాదిగ, కాపు కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :










